TS Assembly Elections 2023 : సిరిశాలగా పేరొందిన సిరిసిల్ల.. కాంగ్రెస్ పాలనలో ఉరిశాలగా మారింది: కేటీఆర్

Byline :  Bharath
Update: 2023-10-17 12:24 GMT

నేతన్నల వల్ల సిరిశాలగా పేరు పొందిని సిరిసిల్ల, కాంగ్రెస్ పాలనలో ఉరిశాలగా మారిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా మారిన తర్వాతనే సిరిసిల్ల జిల్లాగా మారింది. నేతన్నల జీవితాలు మారాయిని చెప్పుకొచ్చారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లడిన కేటీఆర్.. బీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్లలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లను మల్లన్నసాగర్ లో నింపి, అక్కడి నుంచి కూడవల్లి వాగు ద్వారా సిరిసిల్ల బీడ్లకు మళ్లిస్తున్నారు. ఆ నీటితో ఇక్కడి బీడు భూములను సస్యశ్యామలం చేసిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. కన్నీళ్లు కారిన సిరిసిల్ల నేలకు తాగు నీరు, సాగు నీరు అంధించిన ఘనత కేసీఆర్ ది. ఎండాకాలంలోనూ అప్పర్ మానేరు మత్తడి దూకడానికి కారణం కేసీఆర్. సిరిసిల్ల భూగర్భ జలాలు పెరిగి.. బోర్ల ద్వారా పంటలకు నీరందుతుందంటే.. ఆ ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పుకొచ్చారు.

జూనియర్, డిగ్రీ కాలేజీలు కావాలని దర్నాలు చేసిన దుస్థితి పోగొట్టి.. నేడు సిరిసిల్లకు మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు. అంతేకాకుండా గంభీరావుపేటకు రాష్ట్రంలోనే మొదటి కేజీ టూ పీజీ క్యాంపస్ వచ్చింది. వాటితో పాటు ఇంజినీరింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, వ్యవసాయ కాలేజీలను ఏర్పాటు చేసి.. విద్యార్థుల ఉన్నత భవితకు తోర్పడుతున్న వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. సిరిసిల్ల జిల్లాకు అడగకుండానే అన్నీ ఇచ్చిన కేసీఆర్ ను ఆశీర్వదించి.. రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞ‌ప్తి చేశారు. మరో సారి అధికారం ఇస్తే.. ఇంతకన్నా గొప్ప అభివృద్ధిని చేసిచూపిస్తామని చెప్పుకొచ్చారు.




Tags:    

Similar News