ఆంధ్రా లీడర్లతో సత్సంబంధాలు ఉన్నాయి: కేటీఆర్

Byline :  Bharath
Update: 2023-11-11 02:41 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లీడర్లతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, అన్నదమ్మల లాంటివారిమంతూ చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని పోటీ చేస్తున్న క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఏపీలో ఉన్న ఏ రాజకీయ పార్టీతో బీఆర్ఎస్ కు వైరం లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు. బయట ఏదేదో మాట్లాడుతుంటారు, ఏవేవే రాస్తుంటారు అవేవీ నిజం కాదని అన్నారు. ఆర్మూరులో తనకు ప్రమాదం జరిగిన వెంటనే ఆరోగ్యం ఎలా ఉందని నారా లోకేశ్ మెసేజ్ చేశారని చెప్పారు.

‘నాకు లోకేశ్ తమ్ముడు లాంటి వాడు. జగన్, పవన్ కళ్యాణ్ అన్నలాంటి వారు. ముగ్గురితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి’ అని తమ మధ్యున్న బంధాన్ని వివరించారు. ఈ క్రమంలో ఏపీలో ఉన్న రాజకీయ పార్టీల గొడవలకు హైదరాబాద్ వేదిక కాకూడదనే.. చంద్రబాబు అరెస్టు సమయంలో ధర్నాలకు అనుమతి ఇవ్వలేదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు నారా లోకేశ్ కేటీఆర్ కు ఫోన్ చేసి సపోర్ట్ అడిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా చంద్రబాబు అరెస్ట్ ను బీఆర్ఎస్ పార్టీలోని పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు కూడా. ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఫ్రంట్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఏపీ రాజకీయాల్లోనే బీఆర్ఎస్ అడుగుపెట్టింది. రాబోయే ఎన్నికల్లో తమకు మద్దతిస్తుందనే బీఆర్ఎస్ అక్కడి నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది.

Tags:    

Similar News