Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఫిర్యాదు

Byline :  Veerendra Prasad
Update: 2023-12-13 08:28 GMT

మాజీ మంత్రి మల్లారెడ్డి గిరిజనుల భూములను కబ్జా చేశారని పోలీసులు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఆయనపై ఎస్.సి, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. భిక్షపతి అనే వ్యక్తి మల్లారెడ్డిపై శామీర్ పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరంలో భూ కజ్జా చేశారని ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మొత్తం 47 ఎకరాలను మాజీ మంత్రి కబ్జా చేసినట్లు భిక్షపతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గిరిజనుల భూములను... ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే భూములను కబ్జా చేశారని, అదే రోజు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో మల్లారెడ్డితోపాటు స్థానిక ఎమ్మార్వోపైన కూడా మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 420 కింద కూడా కేసు నమోదు చేశారు.




Tags:    

Similar News