TS Assembly Elections 2023 : బీఆర్ఎస్లో చేరిన అంబర్పేట శంకర్, జిట్టా, మామిళ్ల రాజేందర్.. మరో మాజీ ఎమ్మెల్యే

Byline :  Bharath
Update: 2023-10-20 10:25 GMT

తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో.. అసంతృప్త నేతలు పార్టీలు మారే విషయంలో క్లారిటీకి వస్తున్నారు. వెళ్లాలనుకున్న పార్టీలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగినన మీటింగ్ లో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఉద్యమకారుడిగా పేరున్న జిట్టా.. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. కాగా భువనగిరి టికెట్ ఆశించిన జిట్టా.. టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ ఏ పార్టీకి బీ టీం కాదని, రాష్ట్ర ప్రజలకే తాము ఏ టీం అని అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమ నేతలంతా తిరిగి బీఆర్ఎస్ లో చేరుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నో బాధలు పెట్టి తెలంగాణ ఇచ్చిందని, రాష్ట్రం ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీనే కల్పించిందని చెప్పుకొచ్చారు.

బీఆర్ఎస్లోకి అంబర్పేట శంకర్:

ఈ క్రమంలో అంబర్ పేట శంకర్ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీశ్ రావు శంకరన్నకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముదిరాజ్ వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పావులు కదిపింది. అంబర్ పేట శంకర్ కు ముదిరాజ్ వర్గంతో పాటు.. హైదరాబాద్ నగరంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో శంకర్ కు అసెంబ్లీ సీటు ఇచ్చే అవకాశాలు కూడా కపిపిస్తున్నాయి.




Tags:    

Similar News