Congress Senior Leaders : కాంగ్రెస్ గెలిచినా.. ఓడిపోయిన పలువురు సీనియర్లు

Byline :  Krishna
Update: 2023-12-04 03:04 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను కాదని.. ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు. హస్తం పార్టీ 65 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ను క్రాస్ చేసింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్.. అధికారం దక్కించుకోవడానికి పదేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇక ఈ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే కొందరు సీనియర్ నాయకుల్లో మాత్రం సంతోషం లేకుండా పోయింది.

ఈ ఎన్నికల్లో పలవురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఓడిపోయారు. కాంగ్రెస్ సీనియర్లు జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, దామోదర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ గెలిపొందగా.. ఎల్బీ నగర్లో మధుయాష్కీపై సుధీర్ రెడ్డి విజయం సాధించారు. ఇక షబ్బీర్ అలీపై బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ గెలవగా.. జగ్గారెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలిపొందారు. సూర్యపేటలో దామోదర్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి గెలవగా.. అంజన్ కుమార్ యాదవ్పై బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ గెలిపొందారు.

కాంగ్రెస్ పార్టీలో పలుచోట్ల సీనియర్లు ఓడిపోగా.. మరికొన్ని చోట్ల యంగ్ లీడర్లు విజయం సాధించారు. పాలకుర్తిలో యశస్విని, మెదక్లో మైనంపల్లి రోహిత్, నారాయణపేటలో పర్ణిక రెడ్డి, రాజేష్ రెడ్డి వంటి యువ నేతలు ఫస్ట్ టైం గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.


Tags:    

Similar News