Mallareddy : కాంగ్రెస్కు తక్కువైతే అండగా ఉంటా : మల్లారెడ్డి

Byline :  Krishna
Update: 2023-12-15 09:43 GMT

మాజీ మంత్రి మల్లారెడ్డి అంటే బీఆర్ఎస్కే ఓ బ్రాండ్. మైకు పట్టుకున్నారంటే చాలు డైలాగులతో అల్లాడిస్తుంటారు. పాలమ్మినా, పూలమ్మినా అంటూ తన కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. 2018లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఈ సారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగి మరోసారి గెలిచారు. ఇక మల్లారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి అస్సలే పడదు. అప్పట్లో వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ సీఎంగా ఉండగా.. మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు.

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. అక్కడికి తీన్మార్ మల్లన్న వెళ్లారు. ఈ క్రమంలో మల్లారెడ్డి-ఒకరికొకరు ఎదురపడగా ఇద్దరూ పలకరించుకున్నారు. మల్లన్నను మల్లారెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. శాసనసభలో ఎప్పుడైనా కాంగ్రెస్కు బలం తక్కువైతే మీరు అండగా ఉంటారా అని మల్లారెడ్డిని తీన్మార్ మల్లన్న ప్రశ్నించగా.. ఉంటా అంటూ ఆయన బదులిచ్చారు. ఎన్నికల వరకే కోపాలు.. తాపాలు ఉంటాయి.. తర్వాత అందరం ఒక్కటేనని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


Tags:    

Similar News