Meeting BRS Chief Leaders : తెలంగాణ భవన్‌లో BRS ముఖ్య నేతల భేటీ

Byline :  Veerendra Prasad
Update: 2023-12-04 08:35 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీలో గెలిచిన నేతలు భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టిపెట్టారు. రంగంలోకి దిగిన కేటీఆర్‌.. గెలిచిన బీఆర్‌ఎస్‌ నేతలతో తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు. వివరాల ప్రకారం.. తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత, గెలిచిన అభ్యర్థులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, వివేకానందరెడ్డి, సహ పలువురు మాజీ మంత్రులు, ముఖ్యనాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా భవిష్యత్‌ కార్యాచరణపై నేతలతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చర్చిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ ఓటమి, తదితర కీలక అంశాలపై కేటీఆర్‌ చర్చించనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయం సాధిస్తామనుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీకి అనూహ్య పరాజయం ఎదురైంది. మొత్తం 119 స్థానాలకుగాను 39 స్థానాల్లో గెలిచి అధికారానికి దూరమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు కేటీఆర్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.




Tags:    

Similar News