Asaduddin Owaisi :‘షేర్వాణీ కింద ఖాకీ నిక్కర్..’ గొడవ.. రేవంత్‌కు ఒవైసీ కౌంటర్

Byline :  Mic Tv Desk
Update: 2023-11-14 15:09 GMT

తెలంగాణ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతుండడంతో మాటల దాడులు తీవ్రమవుతున్నాయి. ఎంఐఎం పార్టీ బీజేపీ చేతిలో మరబొమ్మలా మారిందని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలను మోదీ కీలుబొమ్మల్లా ఆడిస్తున్న వీడియోలను కూడా తయారు చేసి జనంలోకి వదిలింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలకు పదును పెంచారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ షేర్వాణీ కింద ఖాకీ నిక్కర్(ఆర్ఎస్ఎస్ పాత యూనిఫామ్) ధరిస్తాడని అన్నారు. దీనిపై ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ కీలుబొమ్మ రేవంత్ రెడ్డేనని ఎదురుదాడి చేశారు.

‘‘మీరు చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు మా బట్టల గురించి మాట్లాడతారు. దీన్నే డాగ్ విజిల్ పాలిటిక్స్ అంటారు. నువ్వు(రేవంత్) ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చావని ఇదివరకే చెప్పాను. నీకు ఇప్పుడు కూడా ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలు ఉన్నాయి. నిన్ను మోహన్ భగవత్ ఆడిస్తున్నాడు’’ అని ఒవైసీ అన్నారు.

కాగా రేవంత్ రెడ్డిపై హైట్ ఎంత అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది. బాడీ షేమింగ్ చేయడం సరికాదని, సమాధానలు చెప్పలేకే అలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటోంది. ‘‘రేవంత్ రెడ్డి ఎత్తు ఎంత? అతడు మాట్లాడే మాటలేంటి? అతనికి ఆర్ఎస్ఎస్ టిల్లు అని పేరు పెడుతన్నాం’’ అని అక్బరుద్దీన్ అన్నారు.

Tags:    

Similar News