Harish Rao : హరీశ్ రావు హెలికాప్టర్ ల్యాండింగ్లో గందరగోళం
Byline : Kiran
Update: 2023-11-25 08:21 GMT
మంత్రి హరీశ్ రావు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ లో గందరగోళం నెలకొంది. హెలికాప్టర్ మహబూబాబాద్ లో ల్యాండ్ కావాల్సి ఉండగా.. అకస్మాత్తుగా గూడూరు మండలంలో దిగింది. దీంతో బీఆర్ఎస్ నాయకుల్లో గందరగోళం నెలకొంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీశ్ రావు నవంబర్ 25న మహబూబాబాద్కు బయలుదేరారు. అయితే అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా హెలికాప్టర్ రాంగ్ ప్లేస్లో ల్యాండ్ అయింది.
దీంతో హరీశ్ రావు తన పీఏపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేదేమీ లేకపోవడంతో అందుబాటులో ఉన్న కారులో మహబూబాబాద్ రోడ్ షోకు బయలుదేరారు.