Harish Rao : కాంగ్రెస్కు 12సార్లు అధికారమిచ్చినా చేసిందేం లేదు - హరీశ్ రావు

Byline :  Kiran
Update: 2023-11-16 10:04 GMT

కాంగ్రెస్కు 12సార్లు అధికారం ఇచ్చినా జహీరాబాద్ కోసం చేసిందేమీ లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై ఆయన ఫైర్ అయ్యారు. కర్నాటకలో ఇచ్చిన హామీలు నెరవేర్చని ఆ పార్టీ నేతలు ఇక్కడ అమలు చేస్తారా అని ప్రశ్నించారు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని కానీ వాటిని అమలు చేయడం లేదని హరీశ్ రావు విమర్శించారు. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి హామీలే ఇస్తున్నారని, వాటిని నెరవేరుస్తారా? అని సటైర్ వేశారు. కర్నాటకలో 5 గంటల కరెంట్‌ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ .. ప్రస్తుతం అక్కడ వ్యవసాయానికి 2 గంటల కరెంట్‌ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే జనవరి నుంచి అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇవ్వడమే కాకుండా ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామని హరీశ్‌ హామీ ఇచ్చారు.




Tags:    

Similar News