TS Assembly Elections 2023 : రాహుల్ గాంధీ కాళేశ్వరం జలాలు చల్లుకొని పాప ప్రక్షాళన చేసుకోండి - కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సాగునీటి, తాగునీటి రంగంలో తెలంగాణ దేశానికే టీచింగ్ పాయింట్ అని అన్నారు. మంథని దాకా వెళ్లిన రాహుల్ గాంధీ ఆ పక్కనే ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించాలని కేటీఆర్ సూచించారు. అతిగొప్ప మానవ నిర్మిత ఇంజనీరింగ్ అద్బుతాన్ని చూసి తరించండని అన్నారు. సముద్రంలో కలుస్తున్న గోదావరిని ఒడిసి పట్టి బొట్టు బొట్టును తెలంగాణ మాగాణాల్లోకి ఎలా మళ్లిస్తున్నారో అర్థం చేసుకోవాలని అన్నారు.
బలమైన సంకల్పముంటే నీళ్లు ఎత్తుకు ఎలా పరుగులు పెడతాయో తెలుసుకోవాలని రాహుల్ కు సూచించారు. లక్షలాది మంది రైతులకు కొండంత ధీమా ఇచ్చిన కాళేశ్వరంపై పసలేని విమర్శలు ఇప్పటికైనా మానుకోవాలన్నారు. కాంగ్రెస్ పాలనలోని ఆకలి కేకల తెలంగాణ బీఆర్ఎస్ హయాంలో దేశం కడుపు నింపే అన్నపూర్ణగా ఎలా ఎదిగిందో కళ్లారా చూడాలని రాహుల్ కు చెప్పారు.
60ఏండ్ల కాంగ్రెస్ పాలనలో అన్నదాతను అరిగోస పెట్టినందుకు తెలంగాణ రైతులకు తెలంగాణ రైతుకు బేషరతు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం సాక్షిగా.. కాంగ్రెస్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు పెట్టిన తిప్పలకు కాళేశ్వరం జలాలను నెత్తిన జల్లుకొని పాప ప్రక్షాళన చేసుకోండని రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ సూచించారు. సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన స్వర్ణయుగాన్ని కాంగ్రెస్ మరో వంద జన్మలెత్తినా సాధించలేదని ఇప్పటికైనా ఒప్పుకోండని ట్వీట్ చేశారు.
రాహుల్ జీ..
— KTR (@KTRBRS) October 19, 2023
దేశానికే టీచింగ్ పాయింట్.. తెలంగాణ
మంథని దాకా వెళ్లారు.. పక్కనే కాళేశ్వరం..
ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించండి
దేశ సాగునీటి రంగ చరిత్రలోనే..
అతి గొప్ప మానవ నిర్మిత ఇంజనీరింగ్ అద్భుతాన్ని చూసి తరించండి
సముద్రంలో కలుస్తున్న…