KTR : కేసీఆర్‌ తెలంగాణ మొత్తానికే లోకల్‌.. మంత్రి కేటీఆర్

Byline :  Veerendra Prasad
Update: 2023-11-28 09:40 GMT

కేసీఆర్ బరిలో నిలిచిన కామారెడ్డి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ మాట్లాడిన ఆయన కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని తెలిపారు. ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తానే పూర్తిగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. తెలంగాణను తెచ్చిన కేసీఆర్​కు లోకల్,​ నాన్​ లోకల్​ అని ఉంటుందా అంటూ ప్రశ్నించారు. "కేసీఆర్‌ తెలంగాణ మొత్తానికే లోకల్‌ అని, కేసీఆర్‌ అమ్మగారి ఊరు ఇక్కడే సమీపంలోని కోనాపూర్‌’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు

బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. బీజీ కార్మికులకు పింఛను కటాఫ్ డేట్​ను తొలగిస్తామని మాట ఇచ్చారు. రాష్ట్రంలో 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు పింఛను ఇస్తున్నామని తెలిపారు. ఈ తొమ్మిదిన్నరేళ్లలో దేశానికి, తెలంగాణకు మోదీ చేసింది శూన్యమని మండిపడ్డారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. బీడీ కార్మికులకు ఇచ్చే ఫించన్​ను దశలవారిగా రూ.5వేలకు పెంచుతామన్న ఆయన.. జనవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు.  




Tags:    

Similar News