రాహుల్ పార్టీని కాదు.. ఓ దుకాణాన్ని నడపాలి : కేటీఆర్

Update: 2023-06-01 13:09 GMT

కర్నాటక ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీకి జోష్లో ఉంది. దీంతో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతల కామెంట్లను మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్తో కాంగ్రెస్ పోటీపడే పరిస్థితే లేదన్నారు. అధికారంలోకి వస్తామనే భ్రమల్లో కాంగ్రెస్ ఉందని సెటైర్ వేశారు. ఆ పార్టీకి సరైన నాయకత్వం లేదని విమర్శించారు. సీఎం అభ్యర్థిపై తమలో తామే కొట్టుకునే నేతలు అధికారంలో వస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

రాహుల్ గాంధీ ఒక పార్టీని కాకుండా ఎన్జీవో లేదా దుకాణాన్ని నడపాలని కేటీఆర్ విమర్శించారు. రాహుల్కు పార్టీని నడిపే సత్తాలేదన్నారు. గుజరాత్ ఎన్నికల సమయంలో విదేశాలకు పారిపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యాల వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. రాహుల్ గాంధీ చరిష్మా, ఆయన పాదయాత్ర వల్ల రాలేదని ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలన్నారు. వల్లే అధికారంలోకి దేశ అత్యుత్తమ ప్రధాని అయిన పీవీ నరసింహారావుకు ఢిల్లీలో సమాధానం కాకుండా అవమానించింది కాంగ్రెస్ కాదా అని మండిపడ్డారు.

తెలంగాణలో అమలువుతున్న పథకాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ 75ఏళ్లలో చేయని అభివృద్ధిని.. బీఆర్ఎస్ 9ఏళ్ల చేసిందన్నారు. ఆ రెండు పార్టీల పరిపాలన కొత్త సీసాలో పాత సారా మాదిరి ఉంటుందని విమర్శించారు. . బీఆర్ఎస్ 90 నుంచి 100స్థానాల్లో గెలుస్తుందన్న కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీలకు దమ్ముంటే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని సవాల్ విసిరారు.

Tags:    

Similar News