అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్కు రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీటే చేశారు. ఫలితం గురించి బాధపడలేదని, అయితే ఆశించిన స్థాయిలో రిజల్ట్ లేకపోవడంతో నిరాశ చెందానని కేటీఆర్ స్పష్టంచేశారు. ఎన్నికల ఫలితాలను ఓ పాఠంగా తీసుకుని తిరిగి పుంజుకుంటామని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ అభినందనలు చెప్పారు.
గన్ గురిపెట్టిన ఫోటో షేర్ చేస్తూ శనివారం పోస్ట్ చేసిన ట్వీట్ పైనా కేటీఆర్ స్పందించారు. దీనికి వయసు అయిపోదు.. గురి తప్పిందంతే అంటూ ఆ ట్వీట్ను రీట్వీట్ చేశారు.
This one ain’t gonna age well 😁
— KTR (@KTRBRS) December 3, 2023
Missed the mark https://t.co/IUN1vKdTsc