KTR : కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఓటేస్తే తప్పు చేసినోళ్లమవుతాం - కేటీఆర్

Byline :  Kiran
Update: 2023-10-31 11:48 GMT

కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్పై పోటీ చేస్తానన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సటైర్ వేశారు. కొడంగల్లో చెల్లని రేవంత్.. కామారెడ్డిలో చెల్లుతాడా అని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి, మాచారెడ్డి మండలాల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌.. ఎన్నికల ప్రచారంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించగానే ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయాయని కేటీఆర్ అన్నారు. గంప గోవర్ధన్ ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు. నాయకునికి కావల్సింది ప్రాంత అభివృద్ది, ప్రజా సంక్షేమేనని చెప్పారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల ప్రజలు కేసీఆర్ గారిని అభిమానిస్తున్నారని, ఆయన కామారెడ్డి నుంచి పోటీ చేయడం మన అదృష్టమని అన్నారు.

కామారెడ్డి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందని, రాష్ట్రం మొత్తం ఇటువైపే చూస్తోందని కేటీఆర్ అన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలల్లో మద్దిమల్ల నుంచి మాచారెడ్డికి కాళేశ్వరం ద్వారా సాగునీరు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కామారెడ్డిలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారం చేస్తారని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాల మాటలు, హామీలను నమ్మి కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఓటు వేస్తే తప్పు చేసిన వాళ్లమవుతామని కేటీఆర్ హితవు పలికారు. షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేయడానికే భయపడుతున్నాడని కేటీఆర్ స్పష్టం చేశారు.




Tags:    

Similar News