Palvai Sravanthi Reddy : బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి

Byline :  Veerendra Prasad
Update: 2023-11-12 05:15 GMT

మునుగోడు నేత పాల్వాయి స్రవంతి.. కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పి.. బీఆర్ఎస్‌లో చేరారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె.. బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. తన మద్దతుదారులందరితోనూ మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానన్న ఆమె… తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేసినట్లు తెలిపారు. తాను పదవుల కోసం బీఆర్ఎస్ లో చేరలేదని.. బీఆర్ఎస్ తోనే తెంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని.. చాలా ఆలోచించే బీఆర్ఎస్ లో చేరానన్నారు. కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ.. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదన్నారు. ముందు నుంచి ఉన్న నేతలను వెనక్కి నెట్టి ఇతరులకు అవకాశాలు ఇస్తున్నారు


మంత్రి కేటీఆర్ పాల్వాయి స్రవంతికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పండుగ రోజున ఆమెను పార్టీలోకి ఆహ్వానించడం గొప్ప పరిణామం అని కేటీఆర్ అన్నారు. పాల్వాయి గోవర్ధన రెడ్డి ఫ్యామిలీ గత 60 ఏళ్లుగా కాంగ్రెస్‌కి సేవలు చేసిందన్న కేటీఆర్.. ఆ సేవల్ని హస్తం పార్టీ గుర్తించలేదని అన్నారు. పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించిందన్నారు. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలోకి ఎందుకు చేరారు? ఆ తర్వాత మునుగోడులో ఓడిపోయి.. ఎందుకు కాంగ్రెస్‌లో చేరారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ లో ఉన్న రేవంత్, కొన్ని నెలల క్రితం బీజేపీలో ఉన్నరాజగోపాల్ రెడ్డి ఒకరినొకరు తిట్టుకున్నారని.. మళ్లీ ఇప్పుడు రాజగోపాల్ కాంగ్రెస్ లో చేరగానే ఇద్దరూ ఒకటయ్యారని ఎద్దేవా చేశారు.రాజగోపాల్ రెడ్డి తీరు వల్ల పాల్వాయి స్రవంతి కుటుంబానికి సమస్యలు వచ్చాయన్నా ఆయన.. బీఆర్ఎస్ మాత్రం ఆమె సేవల్ని చక్కగా ఉపయోగించుకొని, తగిన గుర్తింపు ఇస్తామని తెలిపారు.


 


Tags:    

Similar News