KTR : దేశంలో కేసీఆర్ చక్రం తిప్పకుండా కుట్ర పన్నుతున్నారు.. మంత్రి కేటీఆర్

Byline :  Veerendra Prasad
Update: 2023-11-12 05:43 GMT

మరో 17 రోజుల్లో తెలంగాణ ఎన్నికలకు పోలింగ్. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు వేసి ప్రచారంలో జోరు కొనసాగిస్తున్నారు. తమకు పోటీకి దిగిన పార్టీల వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ లు కొత్త కుట్రలకు తెరలేపాయని.. దేశంలో కేసీఆర్ చక్రం తిప్పకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

ఆదివారం తెలంగణ భవన్‌లో కాంగ్రెస్ మహిళా నాయకురాలు పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్‌లో చేరారు. ఆమెకు కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాగైనా లబ్ది పొందాలని కాంగ్రెస్, బీజేపీలు కొత్త కుట్రలకు తెరలేపాయని అనుమానం వ్యక్తం చేశారు. వచ్చే 15 రోజులు పాటు ఇవే కుట్రలు చేస్తూ మన ఆలోచనలు మారేలా చేస్తారన్నారు. సోషల్ మీడియాలో ఢిల్లీ పెద్దలు వదంతులు సృష్టిస్తారని.. రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో కేసీఆర్‌ చక్రం తిప్పకుండా కుట్రలకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. మన ఆలోచనలకు మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు.. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు గాడి తప్పొద్దు.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.




Tags:    

Similar News