TS Assembly Elections 2023 : కాంగ్రెస్‌లో చేరిన మోత్కుపల్లి, నీలం మధు

Byline :  Veerendra Prasad
Update: 2023-10-27 08:46 GMT

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెగురుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరగా.. తాజాగా మాజీమంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, పటాన్‌చెరు నియోవజకవర్గానికి చెందిన నీలం మధు ముదిరాజ్ లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఉమ్మడి ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయంలో మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి నర్సింహులు.. తెలంగాణ ఏర్పడిన తరువాత ఏ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించలేదు. కొన్నేళ్ల క్రితం బీఆర్ఎస్‌లో చేరిన మోత్కుపల్లి.. తనకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరారు. అయితే మోత్కుపల్లి విజ్ఞప్తిని కేసీఆర్ పట్టించుకోలేదు. అప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న.. ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక ఈరోజు కాంగ్రెస్ లో చేరిన ఆయన తుంగతుర్తి సీటు ఆశిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సీటు కోసం కాంగ్రెస్ తరపున అద్దంకి దయాకర్ సహా అనేక మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు కాంగ్రెస్ హామీ ఇస్తుందా ? అన్నది చూడాలి.

ఇక బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నీలం మధు... ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరిపి తాజాగా.. ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరారు. ఆయనకు పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది.




Tags:    

Similar News