New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులకు ఓకే..

Byline :  Veerendra Prasad
Update: 2023-12-19 04:40 GMT

రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తారని, అందులోనే లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరణతోపాటు, ఇది వరకే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులు సరిచేయడం వంటి వాటికి కూడా అవకాశం ఇవ్వనుంది. ఇందుకోసం ఈ నెల 28వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించనున్నట్టు తెలిసింది. ఈ గ్రామ సభల్లోనే కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్‌పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, కాంగ్రెస్‌ నేతలకు రేషన్‌కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించిన కీలక వివరాలను మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో సుమారు ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతో లక్షలాది మంది పేదలు సేవలు పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.




Tags:    

Similar News