KCR : సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో మరో సారి సాంకేతిక లోపం
Byline : Veerendra Prasad
Update: 2023-11-08 09:26 GMT
సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో మరో సారి సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపింది. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య తలెత్తడంతో చాపర్ ను పైలట్ వెంటనే నిలిపివేశాడు. ఇక, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్ నగర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. తిరిగి బయలు దేరే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మార్గాన ఆసిఫాబాద్‌కు సీఎం కేసీఆర్ బయలు దేరి వెళ్లారు.