Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు.. పోలీస్ నోటీసులు
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై రెండు కేసులు నమోదయ్యాయి. పోలీసులు 2 కేసుల్లో నోటీసులు ఇచ్చారు. నామినేషన్ రోజు విద్వేషపూరిత ప్రసంగం చేశారని, నవరాత్రి ఉత్సవాల్లో దాండియా నిర్వాహకులను బెదిరించారని, దసరా రోజున ఆయుధ పూజ సందర్భంగా కత్తులు, ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించారని ఆరోపించారు. ఈ విషయంపై మంగళ్ హాట్ పోలీసులు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీటిపై వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
నవరాత్రి సందర్భంలో కార్యక్రమాలు, వేడుకల్లో ముస్లింలను పాల్గొనేందుకు అనుమతించొద్దని, కార్యక్రమంలో పనిచేయడానికి వచ్చివాళ్ల గుర్తింపు కార్డులు పరిశీలించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్థానిక లీడర్ సమద్ వార్సీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఐపీసీ 153ఏ, 295ఏ, 504 సెక్షన్ల కింద రాజాసింగ్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.