Harish Rao : మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ తనిఖీ చేసిన పోలీసులు
Byline : Kiran
Update: 2023-10-31 12:15 GMT
ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ను పోలీసులు తనిఖీలు చేశారు. సిద్ధిపేట జిల్లా పొన్నాల ప్రధాన రహదారి వద్ద ఎన్నికల విధుల్లో భాగంగా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అటువైపు వచ్చిన హరీశ్ రావు కారును ఆపి తనిఖీలు చేశారు. మంత్రి కారుతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. సోదాలకు సహకరించిన మంత్రి హరీశ్ రావుకు పోలీసులు ధన్యవాదాలు చెప్పారు.