TS Assembly Elections 2023 : 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

Byline :  Bharath
Update: 2023-11-30 10:55 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటుచేయగా.. పోలింగ్‌ సజావుగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు దాదాపు 51.89 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లాలవారీగా చూస్తే మెదక్లో అత్యధికంగా 69.33 శాతం ఓటింగ్ నమోదు కాగా.. హైదరాబాద్‌లో అత్యల్పంగా 31.17 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. ఇక నియోజకవర్గాల విషయానికొస్తే దుబ్బాక నియోజకవర్గంలో అత్యధికంగా 70.48 శాతం పోలింగ్‌ నమోదైంది. యాకుత్‌పురాలో అత్యల్పంగా 20.09 శాతం నమోదైంది. కాగా 13 నియోజకవర్గాల్లో పోలింగ్ 4 గంటలకే ముగిసింది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్ టీ, ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఉమ్మడి ఖమ్మం నియోజకవర్గంలు ఇల్లందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట,కొత్తగూడెంలో నాలుగు గంటలకే పోలింగ్‌ క్లోజ్‌ అయింది. 4 గంటలవరకే పోలింగ్ అనడంతో.. ఓటర్లంతా పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. 4 గంటల్లోపు లైన్ లో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటువేసే అవకాశం కల్పించారు. ఒకటి ఒకటి రెండు ప్రాంతాల్లో తప్ప మిగతా అన్నిచోట్ల ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్




Tags:    

Similar News