Ponguleti Srinivasa Reddy :ఉద్దేశపూర్వకంగానే నామినేషన్ వేసే రోజు సోదాలు.. పొంగులేటి

Byline :  Veerendra Prasad
Update: 2023-11-09 06:59 GMT

కాంగ్రెస్‌ నేత, పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిది గంటలకు పైగా ఆయన ఇంటితో పాటు పార్టీ కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఐటీ దాడులపై పొంగులేటి స్పందించారు. తనను ఇబ్బంది పెట్టేందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ దాడులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఐటీ దాడులు జరుగుతాయని తనకు ముందే తెలుసని అన్నారు. తన మీద, మువ్వ విజయబాబు మీద వేధింపులు ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ నేతల ఇళ్లపైనే దాడులు సాగుతున్నాయని ఆరోపించారు.‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి. వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకుల వద్ద ఉన్నాయి. వారిపై దాడులు చేయకుండా.. నాపై, కాంగ్రెస్‌ నేతలపై దాడులు చేస్తున్నారు. ఇది హేయమైన చర్య. నాపై ఫోకస్‌ పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. తనను విమర్శించే వారిని వేధించడం కేసీఆర్‌కు అలవాటే. . బీఆర్‌ఎస్‌ లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే తనిఖీలు ఎందుకు చేయడంలేదు. ఈరోజు నేను నామినేషన్‌ దాఖలు చేయాలి. నామినేషన్ దాఖలు చేసే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంటుందని తెలిపారు. అర చేతిని అడ్డు పెట్టుకుని సూర్యకాంతిని ఆపలేరు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం’ అని కామెంట్స్‌ చేశారు.

బీజేపీతో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని.. బీజేపీలోకి వెళ్లలేదని, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానని కుట్రపూరితంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి సున్నితమైన వార్నింగ్ లు కూడా వచ్చాయన్నారు. అయితే తనను జైల్లో పెట్టినా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పిన పొంగులేటి రాజ్యాంగపరంగా పోరాడుతానని తెలిపారు.తనను నామినేషన్ వేయకుండా చేస్తే ఈసీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.




Tags:    

Similar News