Ponnala Laxmaiah: టీకాంగ్రెస్కు బిగ్ షాక్.. రాజీనామా చేసిన పొన్నాల

Byline :  Bharath
Update: 2023-10-13 08:33 GMT

ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత (Ponnala Laxmaiah) పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు పొన్నాల. కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్లు కేటాయించాలని గత కొంత కాలంగా పోరాటం చేస్తున్నారు పొన్నాల.. జనగామ టికెట్ విషయంలోనూ తీవ్ర అసంతప్తితో ఉన్నారు. ఆయనను కాదని కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి జనగామ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసహనంలో ఉన్న ఆయన పార్టీకి రాజీనామ చేశారు. పొన్నాల రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కాగా, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీకి తొలి పీసీసీ చీఫ్‌గా, మంత్రిగా పొన్నాల లక్ష్మయ్య పనిచేశారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పొన్నాల రాజీనామా చేయడం కాంగ్రెస్ కు కొంత లోటే.

జనగామ టిక్కెట్ దక్కదని తెలిసే.. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో తనకు అవమానం జరిగినట్లు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో పొన్నాల పేర్కొన్నారు. కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. సీనియర్ మంత్రిగా తనకు జనగామ టిక్కెట్ ఇవ్వకుండా కొందరు అడ్డుకుంటున్నారని, ఆ విషయంలోనే మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మరో రెండ్రోజుల్లో బీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. గులాబీ దళంలో చేరాలనే ఉద్దేశంతోనే ముందస్తుగా రాజీనామా చేశారని కొందరు అంటున్నారు. కానీ జనగామ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఇప్పటికే టిక్కెట్ కన్ఫామ్ చేసింది. పల్లా రాజేశ్వర్ రెడ్డిని జనగామ స్థానం నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్ఎస్. అయితే జనగామ టిక్కెట్ ఇవ్వలేదన్న కారణంతో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పొన్నాల.. బీఆర్ఎస్ లోకి జాయిన్ అవ్వడంలో ఎలాంటి ఉపయోగం లేదని అంటున్నారు. ఈ వార్తలపై ఎలాంటి కచ్చితమైన సమాచారం లేదు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి... పొన్నాలతో మాట్లాడి సర్ది చెబుతారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు   



t

Tags:    

Similar News