Ponnam Prabhakar : మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ

Byline :  Veerendra Prasad
Update: 2023-12-18 06:20 GMT

తెలంగాణ రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ నేడు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు సచివాలయంలో వేద పండితుల చేత నిర్వహించబడిన పూజ కార్యక్రమంలో మంత్రి పొన్నం దంపతులు పాల్గొన్నారు. పూజ కార్యక్రమ అనంతరం పొన్నం ప్రభాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సంబంధిత శాఖల అధికారులతో పాటు నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. TSRTC ఎండీ వీసీ సజ్జనార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.




Tags:    

Similar News