Revanth Cabinet Ministers : రేవంత్ కేబినెట్ మంత్రులకు శాఖల కేటాయింపు
సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు. శుక్రవారం అర్థరాత్రి వరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లతో రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎవరికి ఏ శాఖ కేటాయించాలన్నదానిపై తుది నిర్ణయానికి వచ్చారు. హోం, పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలను సీఎం తన వద్దే పెట్టుకున్నారు.
మంత్రులకు కేటాయించిన శాఖలివే..
భట్టి విక్రమార్క - ఆర్థిక, ఇంధన శాఖ
వ్యవసాయ శాఖ - తుమ్మల నాగేశ్వరరావు
జూపల్లి కృష్ణారావు - ఎక్సైజ్ శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి - నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ
దామోదర రాజనర్సింహ - వైద్య, ఆరోగ్య శాఖ
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - ఆర్‌అండ్‌బీ శాఖ
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు - ఐటీ, అసెంబ్లీ వ్యవహారాలు శాఖ
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి - రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ -
పొన్నం ప్రభాకర్ - రవాణా, బీసీ సంక్షేమ శాఖ
సీతక్క - పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ
కొండాసురేఖ - అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ