Rahul Gandhi : నిజామాబాద్లో రాహుల్ గాంధీ ప్రచారం.. పోస్టర్లతో నిరసన
రాహుల్ గాంధీ రాకను నిరసిస్తూ మరోసారి పోస్టర్లు వెలిశాయి. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఈ పోస్టర్లు కలకలం సృష్టించాయి. బలిదానాల బాధ్యత కాంగ్రెస్దేనని, తమ బిడ్డలను చంపింది ఆ పార్టీయే అని పోస్టర్లలో రాసి ఉంది. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పి, ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్ చేశారు. కర్నాటకలో కరెంటు కష్టాలు, నిరుద్యోగం గురించి కూడా పోస్టర్లలో ప్రస్తావించారు. కాంగ్రెస్ కు ఓటేసిన పాపానికి కర్నాటక కరెంటు లేక అల్లాడుతోందని అలాంటి పార్టీ మనకెందుకని అని రాసి ఉంది.
ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో కాంగ్రెస్ జోరు పెంచింది. ఇందులో భాగంగా పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు రానున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొననున్నారు. బోధన్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన ఉదయం11.30 గంటలకు బోధన్‌లోని సభకు హాజరవుతారు.
నిజామాబాద్, బోధన్ లో పోస్టర్ల కలకలం
— Telugu Scribe (@TeluguScribe) November 25, 2023
రాహుల్ గాంధీ బోధన్ రాకను నిరసిస్తూ వెలిసిన పోస్టర్లు
బలిదానాల బాధ్యత కాంగ్రెస్ పార్టీదే... మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొని ఉన్న పోస్టర్లు
కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందే... ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్
పోస్టర్లలో… pic.twitter.com/OwOUh5NcCH