Priyanka Gandhi : వచ్చే ఐదేళ్లు మీకు ఎలాంటి పాలన కావాలో తేల్చుకోండి.. ప్రియాంక గాంధీ

Byline :  Veerendra Prasad
Update: 2023-11-27 09:39 GMT

బీఆర్ఎస్‌పై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకొస్తే ధరణి పోర్టల్ పేరుతో ఇళ్లు, వాకిళ్లు, భూములు లాక్కుంటారని పేర్కొన్నారు. ప్రశ్నా పత్రాలు లీక్ అవుతాయని, అవినీతి ఆకాశన్నంటుందన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అగవని, అలాగే కొనసాగుతాయని చెప్పారు. వచ్చే ఐదేళ్లు మీకు ఎలాంటి పాలన కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఇదేనన్నారు. సోమవారం భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రియాంక గాంధీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదేళ్లుగా ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. కేసీఆర్ పాలనలో ప్రతీ రంగంలో అవినీతేనని విమర్శించారు. ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయని తెలిపారు. రెండు సార్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే భూ మాఫియా లేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై అవగాహన లేదన్నారు. యువత ఆశలపై బీఆర్ఎస్ నీళ్లు చల్లిందన్నారు. తెలంగాణ సాధించుకున్న లక్ష్యాలు నెరవేరాయా అని అడిగారు.కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.


 


Tags:    

Similar News