TS Assembly Elections 2023 : రేపు తెలంగాణకు రాహుల్, ప్రియాంక.. బస్సు యాత్ర ప్రారంభించనున్న నేతలు
Byline : Kiran
Update: 2023-10-17 15:26 GMT
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ జోరు పెంచింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ బుధవారం తెలంగాణకు రానున్నారు. మూడు రోజుల పాటు వారు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రామప్ప గుడికి వెళ్లనున్న రాహుల్, ప్రియాంకలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల కార్డును దేవుడి మందుంచి ఆశీస్సులు పొందనున్నారు.
బుధవారం సాయంత్రం 5గంటలకు కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు జెండా ఊపనున్నారు. రాష్ట్రంలో మూడు రోజుల పాటు యాత్ర కొనసాగనుండగా.. 8 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్లాన్ రెడీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ మహిళలు, నిరుద్యోగులు, రైతులతో ముచ్చటించనున్నారు.