Revanth Reddy : రేవంత్ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం : రాహుల్

Byline :  Krishna
Update: 2023-12-06 07:13 GMT

రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఏఐసీసీ పెద్దలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను కలిశారు. రేపు జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. రేవంత్ కలిసిన ఫొటోలను రాహుల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్కు స్పెషల్ విషెస్ చెప్పారు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తుందని రాహుల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.




 


తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 నిమిషాలకు గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలుత ఆయన ఉదయం 10.28కి ప్రమాణం చేస్తారని కాంగ్రెస్ తెలిపింది. అయితే తాజాగా దాంట్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. దీనికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.




Tags:    

Similar News