Rahul Gandhi : తెలంగాణ ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు - రాహుల్ గాంధీ

Byline :  Kiran
Update: 2023-11-25 09:26 GMT

పేదల భూములు లాక్కునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. దళిత బంధు పథకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ.3లక్షల చొప్పున కమిషన్లు దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఆదిలాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని వాపోయారు.

తెలంగాణ యువత కలలు, ఆశయాలను బీఆర్ఎస్ నేతలు నాశనం చేశారని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ప్రారంభించిందే కాంగ్రెస్‌ పార్టీ అన్న ఆయన.. తమ పార్టీ మళ్లీ గెలిస్తే సాగుకు ఉచితంగా 24 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆఆఎస్ పదేండ్ల పాలనలో ఎంత మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చాయని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నవని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా అమలు చేస్తామని ఈ పథకం కింద రూ.15వేలు ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలుచేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.




Tags:    

Similar News