Rahul Gandhi : రేపు తెలంగాణకు రాహుల్.. 5 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన..
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో కాంగ్రెస్ జోరు పెంచింది. ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణకు రానున్నారు. గురువారం ఒక్క రోజే 5 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు..ృ
ఉదయం 10గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న రాహుల్ గాంధీ.. 11 గంటలకు పినపాక చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పనపాకలో నిర్వహించే రోడ్ షో.. కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్ లో నర్సంపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు అక్కడే ప్రచారం నిర్వహిస్తారు. నర్సంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్ ఈస్ట్ చేరుకోనున్న రాహుల్.. సాయంత్రం 4 గంటలకు పాదయాత్రలో పాల్గొంటారు. వరంగల్ ఈస్ట్ నుంచి వెస్ట్కు వెళ్లనున్న ఆయన.. సాయంత్రం 6:30 గంటలకు రోడ్డుమార్గం ద్వారా హైదరాబాద్ రాజేంద్రనగర్ రానున్నారు. అక్కడ పార్టీ నేతలతో సమావేసం అనంతరం తిరిగి ఢిల్లీ తిరిగి వెళ్తారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ గురువారం మేనిఫెస్టో రిలీజ్ చేయనుంది. ఇందుకోసం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రేపు హైదరాబాద్ రానున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 11 గంటలకు గాంధీ భవన్ చేరుకుని మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. సాయంత్రం 4గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి హైదరాబాద్లోనే బస చేయనున్న ఖర్గే.. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బెంగళూరు తిరిగి వెళ్తారు.