Rahul Gandhi : ప్రియాంక స్థానంలో రాహుల్ గాంధీ.. కాసేపట్లో కొల్లాపూర్కు..

Byline :  Krishna
Update: 2023-10-31 09:54 GMT

తెలంగాణలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పర్యటనల్లో మార్పులు జరిగాయి. ప్రియాంక గాంధీ స్థానంలో రాహుల్ కొల్లాపూర్ సభకు హాజరుకానున్నారు. ఇవాళ సాయంత్రం 5గంటలకు కొల్లాపూర్లో కాంగ్రెస్ ప్రజాభేరి సభ జరగనుంది. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణాలతో ఆమె పర్యటన రద్దు అయ్యింది. దీంతో ఆమె స్థానంలో రాహుల్ ప్రజాభేరి సభకు హాజరుకానున్నారు.

షెడ్యూల్ ప్రకారం రాహుల్ రేపు తెలంగాణకు రావాల్సి వుంది. ప్రియాంక పర్యటన రద్దు కావడంతో ఒకరోజు ముందుగానే ఆయన తెలంగాణకు రానున్నారు. బుధవారం కల్వకుర్తి, జడ్చర్ల, షాద్ నగర్ నియోజకవర్గాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. షాద్ నగర్ రైల్వేస్టేషన్ నుంచి చౌరస్తా వరకు పాదయాత్ర చేస్తారు. ఆ తర్వాత అక్కడ నిర్వహిచే బహిరంగ సభలో పాల్గొంటారు.


Tags:    

Similar News