Revanth Reddy : నోరు తెరవని సీనియర్లు.. రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటో?

Byline :  Bharath
Update: 2023-12-01 02:33 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎలక్షన్ కోడ్ రిలీజైనప్పటి నుంచి ప్రధాన పార్టీలన్నీ కాళ్లకు బలపం కట్టుకుని మరీ ఈ నెల రోజులు ప్రచారం చేశాయి. అగ్రనేతలంతా రాష్ట్రంలోని నియోజకవర్గాలన్నింటినీ చుట్టేశారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి బడా నేతలంతా రాష్ట్రాల్లో పర్యటిస్తే.. గ్రూపు రాజకీయాలకు చిరునామా అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే ప్రచారంలో పాల్గొన్నాడు. ఒక్కడై నియోజకవర్గాలన్నీ చుట్టేశాడు. ఒకరంటే ఒకరికి పట్టని కాంగ్రెస్ లో.. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి ఉన్నటుండి మార్పు వచ్చింది. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీహెచ్ లాంటి సీనియర్ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే.. అంతెత్తు లేచిపడే నేతలు.. ఇప్పుడు పల్లెత్తు మాట కూడా అనడం లేదు. వారి నియోజకవర్గాల్ని వదిలి బయటికి రావడం లేదు. అంతెందుకు ప్రస్తుతం గ్రూపు రాజకీయాలు కూడా కనిపించడం లేదు. ఇదే ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాపిగ్ గా మారింది.

కాంగ్రెస్ నేతల్లో ఎందుకీ మార్పు? సీనియర్లందర్నీ రేవంత్ ఎలాం మేనేజ్ చేశాడు? అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశం అయింది. దీనికి బదులిచ్చిన రేవంత్ రెడ్డి తనదైన శైలిలో బదులిచ్చారు. ఒక పరేడ్ గ్రౌండ్ తీసుకుంటే.. అందులో రకరకాల ఆటలు ఆడేవారుంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా రకరకాల ఆటలు ఆడేవారుంటారు. ఫైనల్ గా అధిష్టానం చెప్పిందే అంతా పాటిస్తారు. ఇప్పుడు అదే జరిగింది. అందరం ఒక్క తాటిపై నిలబడి తెలంగాణలో పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. గడిచిన పదేళ్లలో రాజస్థాన్, చత్తీస్ గడ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో ఎవరు కూడా సీఎంను మార్చలేదు. ఆ సంప్రదాయానికి కాంగ్రెస్ స్వస్తి పలికింది. దాన్ని ఇప్పుడు బీజేపీ అలవరుచుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎలాంటి సమస్యలతో బాధపడటంలేదు. కాంగ్రెస్ లోని సీనియర్లంతా కలిసికట్టుగా పనిచేయడం.. ఆ పార్టీకి సానుకూలాంశంగా మారే అవకాశం ఉంది.




Tags:    

Similar News