Revanth Reddy as CM: ప్రమాణ స్వీకారానికి ముందు పెద్దమ్మతల్లి దర్శనం

Byline :  Veerendra Prasad
Update: 2023-12-07 06:11 GMT

మరికాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా ప్రమాణ స్వీకారానికి ముందు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి గుడికి వెళ్లనున్నారు రేవంత్. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి రేవంత్‌ చేరుకోనున్నారు. మార్గమధ్యలో గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించనున్నారు.

మరోవైపు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బస్సుల్లో ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్నారు. ఇప్పటికే నాలుగు బస్సులను అధికారులు సిద్ధం చేశారు. మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. రేవంత్ తో పాటు భట్టి, ఉత్తమ్‌, సీతక్క, శ్రీధర్‌బాబు, పొంగులేటి, దామోదర రాజనరసింహ, సుదర్శన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల, జూపల్లి కృష్ణారావు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రుల జాబితాలో ఉన్నవారికి రేవంత్‌ రెడ్డి ఫోన్లు చేశారు.ఇప్పటికే గచ్చిబౌలి ఎల్లా హోటల్‌ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యేలు బస్సుల్లో బయలుదేరారు. రేవంత్‌ ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. ఎల్బీ స్టేడియం వైపు వెళ్లే మార్గాల్లో భారీగా రేవంత్‌ ఫ్లెక్సీలను నేతలు, అభిమానులు ఏర్పాటు చేశారు.




Tags:    

Similar News