TS Assembly Elections 2023 : రాష్ట్రంలో పూర్తైన నామినేషన్ల పరిశీలన.. పోటీలో ఎంతమందంటే..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పరిశీలన పూర్తైంది. రాష్ట్రవ్యాప్తంగా దాఖలైన నామినేషన్లను పరిశీలించిన అబ్జర్వర్లు 2,898 మంది బరిలో ఉన్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,798 నామినేషన్లు దాఖలు కాగా, స్క్రూటినీ అనంతరం ఏకంగా 1900 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. ఈ నెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ క్రమంలో బరిలో ఉన్న తుది అభ్యర్థుల సంఖ్య మారవచ్చని ఎన్నికల అధికారులు చెప్పారు.
నామినేషన్ల పరిశీలన అనంతరం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో అత్యధికంగా 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 67మంది అభ్యర్థులతో ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్ ఉంది. కామారెడ్డిలో 58, ఎల్బీనగర్‌లో 50, కొడంగల్‌లో 15 మంది, బాల్కొండలో 9 బరిలో ఉండగా.. అత్యల్పంగా నారాయణపేటలో 7 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం వరకు గడువు ఉంది.