Ayodhya Reddy : సీఎంవో సీపీఆర్వోగా అయోధ్యరెడ్డి

Update: 2023-12-12 09:51 GMT

సీఎంగా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ పై పూర్తి దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే శరవేగంగా తన టీంను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన అధికారులను బదిలీ చేస్తూ ఆ స్థానంలో తన సొంత టీంను సీఎం రేవంత్ రెడ్డి నియమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం కార్యాలయం చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో)గా సీనియర్ జర్నలిస్ట్ అయోధ్యరెడ్డి నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. ఈ విషయంపై రెండు మూడు రోజుల్లో స్పష్టత రానున్నది. ఇక అయోధ్యరెడ్డి ధీర్ఘకాలం పాటు ప్రింట్ మీడియాలో పని చేశారు. అయితే రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టాక అయోధ్యరెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఆయన.. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి వెన్నంటి ఉంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టగా.. సీఎంగా రేవంత్ రెడ్డి పదవిని చేపట్టారు. ఈ క్రమంలోనే జర్నలిజంలో ధీర్ఘకాలంగా ఉన్న అయోధ్యరెడ్డిని సీపీఆర్వోగా నియమించేందుకు సీఎం రేవంత్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.




Tags:    

Similar News