Revanth Reddy : రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా ప్రమాణం చేసేది వీరే..!

Byline :  Krishna
Update: 2023-12-07 02:32 GMT

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి అంతా సిద్ధమైంది. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు గవర్నర్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ పెద్దలు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే రేవంత్ ఒక్కడే ప్రమాణం చేస్తాడా లేక పలువురు ఎమ్మెల్యేలు మంత్రలుగా ప్రమాణం చేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో రేవంత్తో పాటు పలువురు కీలక నేతలు మంత్రులుగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది.

రేవంత్తో పాటు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా మంత్రులుగా ప్రమాణ చేస్తారని సమాచారం. కొన్ని రోజుల తర్వాత పూర్తిస్థాయి కేబినెట్ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎవరెవరికి ఏ శాఖ అన్నదానిపై కూడా ఏఐసీసీ ఒక అంచనాకు వచ్చింది. భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎంతో పాటు రెవెన్యూ శాఖ కేటాయించే అవకాశం ఉంది. శ్రీధర్ బాబుకు ఆర్థికశాఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నీటిపారుదల శాఖ, సీతక్కకు హోంశాఖ కేటాయించే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News