Shahnawaz Qasim : సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరీగా షానవాజ్ ఖాసీం
Byline : Kiran
Update: 2023-12-12 10:59 GMT
సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరీగా షానవాజ్ ఖాసీంను అపాయింట్ చేశారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2003 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన షానవాజ్ ఇప్పటివరకు హైదరాబాద్ రేంజ్ ఐజీగా ఉన్నారు.
మరోవైపు తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని నియమించింది. సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్‌బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.