TS Assembly Elections 2023 : సింగరేణి మీటింగ్.. రాహుల్కు నో ఎంట్రీ.. రేవంత్, భట్టి రావొచ్చు

Byline :  Kiran
Update: 2023-10-19 17:22 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో మూడు రోజుల బస్సు యాత్రను ప్రారంభించి.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటిస్తున్నారు. యాత్రలో రెండో రోజైన ప్రియాంక, రాహుల్ లు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. గణపురం మండలం చెల్పూర్ కేటిపీపీ గోదావరి గెస్ట్ హౌస్ లో.. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రేవూరి ప్రకాష్ రెడ్డి చేరారు. కాగా సింగరేణి ఒకటో గని గేట్ మీటింగ్ కు ముందు రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురయింది. ఒకటో గని గేట్ మీటింగ్ కి రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించారు. దీంతో ఈ వార్త చర్చనీయాంశం అయింది. గని వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో రేవంత్ రెడ్డి కార్మికులతో మాట్లాడారు. దాంతో కథ సుకాంతం అయింది.




Tags:    

Similar News