TS Assembly Elections 2023 : కాంగ్రెస్ అంటే.. మహిళలను, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించే పార్టీ: ఎమ్మెల్యే సీతక్క

Byline :  Bharath
Update: 2023-10-18 12:52 GMT

కాంగ్రెస్ అంటే పేదల పార్టీ.. సంక్షేమ పార్టీ.. మహిళలను, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించే పార్టీ అని అన్నారు ఎమ్మెల్యే సీతక్క. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను.. బీఆర్ఎస్ పార్టీ కాపీ కొట్టింది. హామీల్లో అమలు చేసే డబ్బును.. వేలంపాటలా పెంచుకుంటూ పోయింది. 10 ఏళ్లు అధికారంలో ఉండి, పేదలను మరింత పేదలుగా చేసిన పార్టీ బీఆర్ఎస్ అని ఆరోపించారు. ములుగులో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ విజయ భేరీ యాత్రలో పాల్గొన్న సీతక్క.. బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును ఎంగట్టారు. ప్రశ్నించే గొంతులను, పనిచేసే నాయకులను అసెంబ్లీకి దూరం చేస్తున్నారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు.

రాష్ట్ర నాయకులు అంటే దొరల గడీల దగ్గర పనిచేసే బానిసల్లా చూస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీవల్లే జరిగిందేం లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అస్సైన్డ్ భూములకు పట్టాలు, పేదలకు భూములు, పోడు భూములకు పట్టాలు, ఆరు గ్యారెంటీలను అమలు పరుస్తారని వివరించారు. చివరి శ్వాస వరకు ప్రజల కోసం, ప్రజల పక్షణ, ప్రజల మధ్య నుంచి పోరాడతానని చెప్పుకొచ్చారు.




Tags:    

Similar News