Telangana Elections: సోషల్ మీడియాలో మొదలైన ఎన్నికల యుద్ధం

Byline :  Bharath
Update: 2023-10-12 07:50 GMT

తెలంగాణలో ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి.. పార్టీలన్నీ తమ వ్యూహాలు మొదలుపెట్టాయి. అపోజిషన్ ను విమర్శిస్తూ.. ఇతర పార్టీల తప్పులను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా రాజకీయ పార్టీల ప్రచారంలో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ సోషల్ మీడియాపై ఎక్కువ ఫోకస్ పెట్టాయి. తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. సోషల్ మీడియా డెస్క్ లు ఏర్పాటుచేసుకుని ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. లీడర్లంతా తమ రోజువారి ప్రచార కార్యక్రమాలు, వివరాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అప్ డేట్ ఇస్తున్నారు. దానికోసం సోషల్ మీడియాపై అవగాహన ఉన్నవాళ్లను ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నారు.




 


ఇప్పటికే చాలామంది అభ్యర్థులు వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్ మాద్యమాలను తమ వేదికలుగా చేసుకుని ప్రచారం మొదలుపెట్టారు. దీంతో సోషల్ మీడియాలో కూడా పొలిటికల్ వార్ మొదలయింది. నేతల మధ్య ఆన్ లైన్ వార్ నడుస్తుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, అధికార పార్టీ ప్రతినిధి దాసోజు శ్రవణ్ చేసిన ట్వీట్ కాంగ్రెస్ నేతలను ఆగ్రహానికి గురిచేసింది. ‘రేవంత్ రెడ్డి పట్ల జాగ్రత్త వహించండి. తెలంగాణ ఫ్యూచర్ రిస్క్ లో ఉంది.’ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా ‘రేవంత్ పే.. కోట్లు కొట్టు సీటు పట్టు’ అంటూ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశాడు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీట్లను అమ్ముకుంటున్నాడని, టికెట్ల కోసం సొంత పార్టీ నేతలనే దోచుకుంటున్నాడని ఆరోపించారు. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.




 






Tags:    

Similar News