Sridhar Babu : శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ బాధ్యతలు

Byline :  Kiran
Update: 2023-12-09 05:03 GMT

అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ఐటీ మంత్రి ఎవరన్న దానికి సమాధానం దొరికింది. కరీంనగర్కు చెందిన సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ హైకమాండ్ ఐటీ శాఖ బాధ్యతలు అప్పజెప్పింది. ఉన్నత విద్యావంతుడైన శ్రీధర్ బాబు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.

మంత్రి శ్రీధర్ బాబు తన తండ్రి, స్పీకర్ శ్రీపాదరావు మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందిన ఆయన 1998లో ఏపీ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. అయితే 1999లో శ్రీపాదరావును నక్సల్స్ కాల్చిచంపడంతో తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు శ్రీధర్ బాబు రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో మరోసారి గెలిచి కాంగ్రెస్ విప్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2009, 2018లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కావడం విశేషం. 2010 నుంచి 2014 వరకు ఆయన సివిల్ సప్లై, న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లోపూ గెలిచిన ఆయనకు కీలకమైన ఐటీ శాఖ దక్కింది.




Tags:    

Similar News