Telangana CM Candidate: సీఎం అభ్యర్థి ఎంపికపై కొనసాగుతోన్న సస్పెన్స్

Byline :  Veerendra Prasad
Update: 2023-12-05 04:14 GMT

కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి పేరును సోమవారమే ప్రకటిస్తారని.. ప్రమాణ స్వీకార కార్యక్రమం సైతం అదే రోజు ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా సీఎం ఎంపిక వాయిదా పడింది. సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ సీఎల్పీ చేసిన తీర్మానాన్ని అధిష్టానానికి పంపిన ఇన్‌ఛార్జ్‌లు.. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం తెలంగాణ సీఎం అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ఉన్న సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లారు.

 ఢిల్లీలో భట్టి, ఉత్తమ్ ఇవాళ మధ్యాహ్నం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. సీఎం, మంత్రిమండలి ఎంపిక గురించి వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నెక్ట్స్ సీఎంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. సీఎల్పీ భేటీలోనూ రేవంత్ రెడ్డి వైపే మెజార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపినట్లు టాక్. ఈ క్రమంలో సీఎం రేసులో ఉన్న ఉన్న భట్టి, ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానుండటం హాట్ టాపిక్‌గా మారింది. సీనియర్ నేతల ఢిల్లీ ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక, తెలంగాణ నెక్ట్స్ సీఎం ఎవరు అవుతారా అని రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.




Tags:    

Similar News