TS Assembly Elections 2023 : పోరు రసవత్తరం.. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్

Byline :  Veerendra Prasad
Update: 2023-10-26 08:15 GMT

ఎన్నికలకు మరో నెల రోజుల మాత్రమే సమయం ఉంది. అధికార పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఇతర పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ.. కేసీఆర్‌ ప్యామిలీని టార్గెట్ చేసుకొని ఈసారి బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. రెండు చోట్ల పోటీ చేస్తున్న కేసీఆర్ ఫార్ములానే కాంగ్రెస్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కుటుంబంపైన బలమైన నేతలను పోటీకి దింపే ప్రయత్నం చేస్తున్నది

ఈసారి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలోనూ పోటీ చేయబోతున్నారు. అయితే కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కు పోటీగా బలమైన నేతను బరిలో నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోటీకి నిలబెట్టాలని ఆలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. రేవంత్ రెడ్డిని కొడంగల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీకి దింపాలనే వ్యూహాన్ని కాంగ్రెస్ రచిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, కేసీఆర్ కొడుకు, మేనల్లుడు, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపైనా బలమైన నేతలను బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి

బీజేపీ నుంచి సొంతగూటికి చేరబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా.. తన సొంత నియోజకవర్గం మునుగోడుతోపాటు సీఎం కేసీఆర్ పై పోటీ చేయబోయే మరో స్థానం.. గజ్వేల్‌లోనూ బరిలోకి దిగబోతున్నట్టు సమాచారం. ఇక కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ పోటీ చేయబోతున్న సిరిసిల్లలో సైతం.. ఇప్పటికే హుజూర్ నగర్ టికెట్ కన్ఫామ్ చేసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోటీలో నిలుపనుంది కాంగ్రెస్. మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని.. సీఎం కేసీఆర్ మేనల్లుడు, మంత్రి అయిన హారీష్ రావుకు ప్రత్యర్థిగా సిద్ధిపేటలో బరిలోకి దించనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గోండ నుంచి పోటీచేయబోతున్నారన్న సంగతి తెలిసిందే.

 

Tags:    

Similar News