Telangana election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. 33 జిల్లాల్లో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఎన్నికల సంఘం ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తోంది. తాజాగా, ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కేంద్రాలను కూడా ఖరారు చేసింది. 33 జిల్లాల్లో 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 15 నియోజకవర్గాల ఓట్లు లెక్కించనున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 8 నల్గొండ, నిజామాబాద్‌లలో 6 చొప్పున, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మంలలో 5 చొప్పున, కరీంనగర్, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేటలలో 4 వంతున ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జనగామ, వరంగల్ జిల్లాల్లో 3 చొప్పున, కుమురంభీం-ఆసిఫాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, నారాయణపేట, జోగులాంబ-గద్వాల, యాదాద్రి-భువనగిరి, హనుమకొండ, మహబూబాబాద్‌లలో 2 చొప్పున, వనపర్తి, జయశంకర్ భూపాలపల్లి, ములుగులలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసింది.
మొత్తం 49 ఓట్ల లెక్కింపు కేంద్రాల లిస్ట్ ఇదే..