Telangana Assembly Meeting : అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. కొనసాగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణం

By :  Bharath
Update: 2023-12-09 05:53 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం అయింది. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన ఈ సమావేశం జరగుతోంది. సభ సమావేశమైన వెంటనే ప్రమాణస్వీకారోత్సవానికి సంబంధించిన విధివిదానాలను స్పీకర్ అక్బరుద్దీన్ సభ్యులకు వివరించారు. అనంతరం మొదట సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేయగా.. తర్వాత 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు.

అనంతరం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. అక్బరుద్దీన్ ను స్పీకర్ గా నియమించినందుకు బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించారు. మరోవైపు అనారోగ్యం కారణంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సభకు హాజరుకాలేదు. దీంతో ఈ రోజు 109 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రమాణం చేయనున్నారు.




Tags:    

Similar News