CPM జాబితా విడుదల.. 14 మంది అభ్యర్థుల ఖరారు

14 స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు వీరే;

By :  Lenin
Update: 2023-11-05 04:13 GMT



సీపీఎం 14 మందితో జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ తో పొత్తు ఖరారు కాకపోవడంతో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమయింది సీపీఎం. రాష్ట్రంలోని 14 స్థానాల్లో పోటీచేయబోయే అభ్యర్థులను ప్రకటించింది. పాలేరులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేయనున్నారు. సత్తుపల్లిలో భారతిని బరిలోకి దింపనున్నారు. ఇలా 14 స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను సీపీఎం ప్రకటించింది.

ఆ 14 మంది వీరే..


భద్రాచలం.. కారం పుల్లయ్య

అశ్వారావు పేట.. పి అర్జున్

పాలేరు.. తమ్మినేని వీరభద్రం

మధిర.. పాలడగు భాస్కర్

వైరా.. భుక్యావీరభద్రం

సత్తుపల్లి.. భారతి

ఖమ్మం ..శ్రీకాంత్

మిర్యాలగూడ.. జూలకంటి రంగారెడ్డి

నకిరేకల్.. చిన వెంకులు

భువనగిరి.. నర్సింహ

జనగామ.. కనకారెడ్డి

ఇబ్రహీంపట్నం.. యాదయ్య

పటాన్ చెరు.. మల్లిఖార్జున్

ముషీరాబాద్..దశరథ్





 


కాంగ్రెస్ తో పొత్తుకోసం సీపీఎం ప్రయత్నించింది. అయితే పొత్తు చర్చలు ముందుకు సాగలేదు. కాంగ్రెస్ మిర్యాలగూడ, హైదరాబాద్ నగరంలో ఒక సీటు ఇచ్చేందుకు సిద్ధమయింది. అయితే సీపీఎం ఇందుకు అంగీకరించలేదు. తమకు బలమున్న స్థానాల్లో సీట్లు కేటాయించాలని కోరినా కాంగ్రెస్ నుంచి స్పందన రాకపోవడంతో ఒంటరిగా పోటీ చేయాలని డిసైడ్ అయింది

Tags:    

Similar News