Vikas Raj : ఎమ్మెల్సీ కవితపై వచ్చిన కంప్లైంట్స్పై స్పందించిన వికాస్ రాజ్
Byline : Kiran
Update: 2023-11-30 08:36 GMT
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ అన్నారు. ఈవీఎంలలో సమస్యలు వచ్చిన చోట్ల కొత్తవి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రూరల్ ఏరియాల్లో పోలింగ్ శాతం బాగానే ఉందన్న ఆయన.. అర్బన్ ఏరియాల్లో మాత్రం మందకొడిగా సాగుతోందని చెప్పారు. అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు మినహా ఓటింగ్ సజావుగా సాగుతోందని వికాస్ రాజ్ అన్నారు. మరోవైపు కవితపై వచ్చిన కంప్లైంట్స్పైనా వికాస్ రాజ్ స్పందించారు. అందిన ప్రతి ఫిర్యాదుపై డీఈఓలను రిపోర్ట్ అడిగామని చెప్పారు. వారిచ్చే రిపోర్టు ఆధారంగా కోడ్ ఉల్లంఘించినట్లు తేలితే ఎఫ్ఐఆర్ నమోదుచేస్తామని వికాస్ రాజ్ ప్రకటించారు.